చంద్రంపేట చౌరస్తాలో రాస్తారోకో.
తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులు గల మెత్తారు. గురువారం రుణమాఫీ చేయాలని కోరుతూ చంద్రంపేట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగవేసేందుకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద..
బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జిందo చక్రపాణి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అమానుషంగా ప్రవర్తించడానికి తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
