రెండు లక్షల రుణాలు తక్షణమే మాఫీ చేయాలి.

బియ్యం కార్ శ్రీనివాస్. సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే రైతుల రుణాలు మాఫీ చేయాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ కోరారు. గురువారం జిల్లా కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో రైతు రుణాలను మాఫీ చేసేలా చూడాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ధ్రువీకరణలు చూసిన తర్వాతే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని తెలిపారు. రుణమాఫీకి ఇలాంటి నిబంధనలు లేకుండా తక్షణమే రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుసుమ గణేష్, చిప్ప దేవదాస్, వేముల పోశెట్టి, సత్యనారాయణ పాల్గొన్నారు.

.