ప్రజల్లో మట్టి ప్రతిమల పట్ల సానుకూలత.
తెలంగాణ ప్రభ. ( సిరిసిల్ల) విఘ్నాలను తొలగించే నాయకుడు వినాయకుడు. ప్రజల తొలి పూజలు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర రసాయనాలు పెద్ద ఎత్తున వాడడం వల్ల పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్న మాట. పర్యావరణాన్ని కాపాడాలంటూ మట్టి ప్రతిమలనే పూజించాలని కోరుతూ పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాలో పర్యావరణ ప్రేమికులు ప్రకృతిని కాపాడాలనే భావంతో మట్టి ప్రతిమలను పూజించడాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. సిరిసిల్లలో పలువురు వ్యాపారులు వినాయక మట్టి ప్రతిమలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. 5 ఇంచులు మొదలుకొని నాలుగు ఫీట్ల ఎత్తు వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తంగళ్ళపల్లి మండలం లో ఇంకాస్త పెద్దవైన వినాయక మట్టి ప్రతిమలు కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల మార్కెట్లోని గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం వివిధ ఆకృతుల్లో రూపాల్లో వినాయక ప్రతిమలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడి ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత గుర్తించి ప్రతి ఒక్కరు మట్టి ప్రతిమలనే పూజించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
పర్యావరణాన్ని కాపాడాలనే...
ఎలిగేటి కృష్ణ, మట్టి వినాయక ప్రతిమల విక్రేత.
పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వాడి ప్రకృతిని కలుషిత చేయొద్దని ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ప్రకృతికి నష్టం చేయని మట్టి ప్రతిమలు వాడాలని కోరుతున్నాం. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలన్న మా సూచన పట్ల ప్రజలలో కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. మట్టి ప్రతిమలను పూజించాలని కోరుతున్నాం.
