"ఎస్సీ వర్గీకరణ వద్దురా.. కలిసి ఉండడం ముద్దురా"

కోటగిరిలో బంద్ ప్రశాంతం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): ఎస్పీ ఎవరికీరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త భారత్ బంద్ పిలుపుమేరకు కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ బంద్ కార్యక్రమంలో విద్యాసంస్థలు వ్యాపార సముదాయాలు మెడికల్ హోటల్ చిరు వ్యాపారస్తులు దుకాణాలను మూసివేసి బందుకు మద్దతు పలికారు. శాంతియుతంగా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ బంద్ లో భాగంగా మాల మహానాడు అధ్యక్షులు సాయన్న మాట్లాడుతూ.... ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడంతో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ధర్మాన్ని చేపట్టడం  జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాల మాదిగ  కులాల మధ్య చిచ్చుపెట్టి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. మాల మాదిగలు కలిసి ఉంటే  రాజ్యాధికారం చేజిక్కించుకొని రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలిస్తారని భయంతో విడదీయడం జరుగుతుందని హెచ్చరించారు ఇప్పటికైనా వర్గీకరణ ఉపసంహరించుకోకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కు  వినతి పత్రం సమర్పించారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో ఎస్సైకి వినతిపత్రం అందజేశారు .


ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ చిన్న సాయన్న ఉపాధ్యక్షులు కాలే సాయిలు, పుప్పల సైదయ్య అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు బ్యాగరి రాములు, జంగం సాయిలు పాలగంగారాం, మారుతి కొత్తపల్లి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు మారుతి సాయి సతీష్ కుమార్ శివ శంకర్ సాయిరాం సాయిబాబా,  కోడిచర్ల ఈరవంత్ రావు రవి,పోతాంగల్ వీరేంధర్, ఎత్తోండ క్యాంప్ మొగులప్ప, సంజీవ్,తుకారం,శంకర్ సూరి, దోమలేడిగి గౌతమ్ రవి భీమ్రావు ఉత్తం, సోంపూర్ రాహుల్, రాజేందర్,  టాక్లి సత్యపాల్ ఆయా గ్రామాల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

.