కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.
తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల). మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనుడి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ అన్నారు. మంగళవారం గాంధీ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి 8వ వేడుకలు నిర్వహించారు. అని చిత్రపటాన్ని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం లౌకిక వాదం పరిరక్షణ కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనుడని అన్నారు. రాజీవ్ గాంధీ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
