తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): ఎస్సీ,ఎస్టీలను వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈనెల 21న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఇల్లంతకుంట మాల మహానాడు యువజన సంఘం సభ్యులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కొరకు వర్గీకరణ పేరుతో ఎస్సి,ఎస్టీలను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా ఎస్సి,ఎస్టీలు ఉద్యమించకపోతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందని అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సి,ఎస్టీలకు కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలిపారు.సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సి,ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని,కాబట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు,ఉద్యోగ సంఘాల నేతలు,దేశంలో వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఎస్సీ,ఎస్టీ నేతలు భారత్ బంద్ లో పాల్గొనాలని కోరారు.21న జరిగే భారత్ బంద్ ను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు యువజన సంఘం సభ్యులు చాతర్ల రాజు,చాతర్ల బాబు,న్యాత అనిల్,మామిడి మహేందర్,మామిడి పర్శరాం, ఎలుక రాము,మామిడి సురేష్ పాల్గొన్నారు.
