రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి నిరడి ఈశ్వర్.
తెలంగాణ ప్రభ (కోటగిరి): ఎస్సి వర్గీకరణకి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్టు నెల 21న బుధవారం నాడు బహుజన్ సమాజ్ పార్టీ, జాతీయ బహుజన సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కి పిలుపు నిచ్చారు. మాలమహానాడు బోధన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి నీరడి ఈశ్వర్ తెలిపారు. దుకాణా దారులు,ప్రభుత్వ,ప్రయివేటు విద్య సంస్థలు అందరూ బందుకు సహకరించలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి,మాల మహానాడు బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు కారం స్వామి,మాల మహానాడు బోధన్ పట్టణ నాయకులు పి.యాదగిరి, బీఎస్పీ బాన్సువాడ అసెంబ్లీ ఇంచార్జీ నీరడి ఈశ్వర్ ,దాసరి శ్యామ్, ఇందురు సాయిలు,విద్యాసాగర్,సునీల్ మండల నాయకులు పాల్గొన్నారు.
.