దుందిగల్ లో ఘనంగా "శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ" అమ్మవారి భోనాలు...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుందిగల్ మున్సిపాలిటీలోని "శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ దేవాలయం" బోనాల వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్  మాట్లాడుతూ రాజరాజేశ్వరి అమ్మవారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి కొలవడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. 

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, కౌన్సిలర్ జక్కుల శ్రీనివాస్, పాక్స్ మాజీ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు బండారి మహేష్,ఈ.శ్రీనివాస్,  శ్రీనివాస్ గౌడ్, యు. కృష్ణ, నర్సింగ్ గౌడ్, నల్తూరి శ్రీకాంత్, యాదగిరి, మంత్రి యాదగిరి, రామరాజు, వెంకటేష్, కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

.