-బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) గాంధీనగర్ ఇండస్ట్రీ ఏరియాలో "శ్రీ జీవన్ పాలిమర్ కంపెనీ లో"24 మంది మహిళ కార్మికురాలు గత కొన్ని సంవత్సరాలుగా నుండి పని చేయడం జరుగుతుంది... శ్రీ జీవన్ పాలిమర్ కంపెనీ లో పాత మేనేజ్ మెంట్ వెళ్లిపోవడంతో కొత్త మేనేజ్ మెంట్ రావడంతో కంపెనీలో పని చేస్తున్న 24 మంది మహిళా కార్మికురాలకు రావాల్సిన మే, జూన్ రెండు నెలల వేతనం రావాల్సి ఉండగా ఏదో రకంగా మభ్యపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ మహిళ కార్మికురాలను బయటకు పంపించేవారు.. మహిళ కార్మికురాళ్లకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి కార్మికుల ద్వారా తెలుసుకొని బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని గురించి తెలుసుకొని రవిసింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి మహిళ కార్మికురాలకి జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన, రవిసింగ్ హుటాహుటిన, శ్రీ జీవన్ పాలిమర్ కంపెనీ దగ్గరికి వెళ్లి పాత,నూతన మేనేజ్ మెంట్ తో మాట్లాడి మహిళ కార్మికురాళ్లకి రావలసిన వేతనం గురించి పలుమార్లు చర్చించి, మహిళ కార్మికురాలకి మే నెల వేతనం ఇప్పించడం జరిగింది. అలాగే జూన్ నెల ఒక వారం టైం ఇవ్వమని కంపెనీ మేనేజ్ మెంట్ కార్మిక నాయకుడు రవిసింగ్ తో చెప్పడంతో కార్మిక నాయకుడు రవిసింగ్ మేనేజ్ మెంట్ మాటకు విలువ వచ్చి ఒక వారం మహిళా కార్మికురాలకు మీకు మిగతా నెల కూడా ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇవ్వడంతో మహిళా కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. మహిళ కార్మికురాలు మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు... ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు..
