వస్త్ర పరిశ్రమలో కష్టాలు తొలగిపోవాలి..

కల్వకుంట్ల తారక రామారావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు. 

చండీయాగం లో పాల్గొన్న కేటీఆర్. 

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న చండీ మహాయాగంలో కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మార్కండే ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయం అందించానని రానున్న రోజుల్లో మరింత సహకారం అందిస్తానని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాలు తొలగిపోయి అందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, పలువురు నాయకులు పద్మశాలి పురోహితులు పాల్గొన్నారు.

.