రైతు రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలి.

బండి సంజయ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి. 

చండీయాగం లో పాల్గొన్న బండి సంజయ్. 

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల). రైతు రుణమాఫీ పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతా పత్రం విడుదల చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, బిజెపి నాయకులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోనీ శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయంలో జరుగుతున్న చండి మహా యాగంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో 26 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి 16,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. 70% రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన టిఆర్ఎస్ మాటలు నమ్మి అప్పుల పాలైన రైతులు రెండు లక్షలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

.