సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగీస్తాం..

కల్వకుంట్ల తారక రామారావు. సిరిసిల్ల శాసనసభ్యులు. 

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తామని సిరిసిల్ల శాసనసభ్యులు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా బైపాస్ రోడ్డులోని నర్సింగ్ కాలేజీ వద్ద పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ బలహీన వర్గాల నాయకుడుగా సర్వాయి పాపన్న నిరంకుశత్వంపై పోరాడారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులవృత్తులపై ఆధారపడిన వృత్తిదారులకు చేయూత అందించమని అన్నారు. చెట్టు పన్ను రద్దు చేయడంతో పాటు, వైన్స్ షాప్ లలో 15% గౌడ్ లకు రిజర్వేషన్ కేటాయించమని తెలిపారు. బిసి వర్గాల సంక్షేమం కోసం గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశామని అన్నారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏదైనా ఒక జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టారని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

.