తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం తెల్ల రవన్న యువసేన ఆధ్వర్యంలో గోమాతకు వైద్య చికిత్సలు నిర్వహించారు. గ్రామంలోని దేవుడు ఆవు అస్వస్థత గురి కావడంతో తెలుసుకున్న తెల్ల రవన్న యువసేన సభ్యులు విషయాన్ని గోపాల మిత్ర పశు వైద్యుడు డాక్టర్ గాయక్వాడ్ రాముకు తెలియజేయగా ఘటన స్థలానికి చేరుకొని ఆయన గోమాతకు వైద్య చికిత్సలు జరిపారు. సెలైన్ ను ఎక్కించారు. అరగంటలో గోమాత కోలుకోవడంతో పశు వైద్యుడు రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్ల రవన్న యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్ బిజెపి నాయకులు గాండ్ల శ్రీనివాస్ చిత్తరి రాజు యువసేన సభ్యులు కప్ప సంతోష్ బొట్టే సాయి తేజ బర్ల అర్పిత్ మోసెట్టి వర్షిత్ దామరంచ సంతోష్ యువకులు పాల్గొన్నారు
