తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ కోదండరామ్ ను టి ఆర్ టి ఎఫ్ నేతలు మర్యాదపూర్వకంగా హైదరాబాదులోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ విద్యారంగంలో విశేష అనుభవం ఉన్న కోదండరాం నేతృత్వంలో విద్యా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కటకం రమేష్, మా రెడ్డి అంజిరెడ్డి, కావలి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
