18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
72 మంది గ్రామీణ యువతీ, యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేత.
తెలంగాణ ప్రభ( సిరిసిల్ల): ప్రతి ఒక్కరు సామాజిక స్పృహ కలిగి ఉండాలని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కూలి శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రుద్రంగి ,వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువతి యువకులకు అవగాహన కల్పించి,వారి నుండి దరఖాస్తులు స్వీకరించి, డ్రైవింగ్ లైసెన్సు కి సంబంధించిన ఆన్లైన్ పరీక్ష పై అవగాహన కల్పించి, పరీక్షలో ఆర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ,రవాణా శాఖ అధికారులతో కలసి లైసెన్స్ లు పంపిణీ చేసిసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో సామాజిక స్పృహతో మంచి కార్యక్రమానికి నాంది పలికారని, శాంతి భద్రతలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ జిల్లా పోలీసులు విశేష కృషి అభినందించారు.జిల్లా పోలీస్ శాఖ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో శాంతి భద్రతలను కాపాడుతునే విన్నూత కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అవుతున్నారని,పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ పేట్టి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.డ్రైవింగ్ వచ్చి అర్హులైన వారందరూ కచ్చితంగా డ్రైవ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.ప్రమాదాలు జరిగిన సందర్భలలో మొదటగా అడిగేది లైసెన్స్ అని , ప్రమాదాలు జరిగిన సమయాల్లో లైసెన్స్ కలిగి ఉండటం వలన ప్రమాద భీమా లాంటివి వర్తిస్తాయన్నారు.
కలెక్టర్ తో పాటు ఎస్పీ అఖిల మహాజన్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీటీఓ లక్ష్మణ్ ,సి.ఐ లు ,ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు
.