మక్కపల్లి పూజ,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్.
తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) జూనియర్ డాక్టర్ మోమితపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ రాష్ట్ర కన్వీనర్ మక్కపల్లి పూజ డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీ విద్యార్థునిలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు ఉన్న ప్రజలను లేకుండా పోతుందని అన్నారు. మౌనిత మృతి పై సమగ్ర విచారణ జరిపి నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లార ప్రశాంత్, సాయి భరత్, సాత్విక, ఇమ్రా, శరణ్య, లిఖిత తదితరులు పాల్గొన్నారు.
