తెలంగాణ ప్రభ (సిరిసిల్ల). గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పలువురు సిరిసిల్ల నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. కోదండరామును కలిసిన వారిలో ప్రజా సమీకృత సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు రవి వర్మ, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు బోజ్జ కనకయ్య, కాంగ్రెస్ నాయకులు చొక్కాల రాము, తదితరులు ఉన్నారు.
