తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) మహిళల పట్ల కేటీఆర్ వైఖరి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌరస్తాలో శనివారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా కేటీఆర్ మహిళల పట్ల అహంకార ధోరణి మానుకోవాలని అన్నారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాముని వనిత, వెలుమల స్వరూప, వైద్య శివప్రసాద్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
