తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సిరిసిల్ల గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గీత జ్ఞాన యజ్ఞాల కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సేవాసమితి అధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి దేవాలయంలో ఆగస్టు 20 మంగళవారం నుండి ఆగస్టు 26 వరకు అక్షయ చైతన్య గారిచే భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం పై ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. భక్తులు హాజరు కావాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో మోతిలాల్, డాక్టర్ జనపాల శంకరయ్య, అంకారపు కృష్ణ హరి, గజ్జల్లి రామచంద్రం, మెరుగు రాజేశం, కొక్కుల రాజేశం, వెల్దండి సంపత్, వెంగళ కమలాకర్ అనిత తదితరులు పాల్గొన్నారు.
