బియ్యం కార్ శ్రీనివాస్, సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి, అధ్యక్షులు.
తెలంగాణ ప్రభ(సిరిసిల్ల): చౌక ధరల దుకాణాల నుండి చెక్కర పంపిణీ చేయాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి చేసిన విజ్ఞప్తి ఫలితంగా చక్కెర పంపిణీ జరుగుతుందని పౌర సంక్షేమ సమి తి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పౌర సరఫరా శాఖ అధికారులకు సంవత్సర కాలంగా చక్కర పంపిణీ నిలిచిపోయిందని తిరిగి పంపించాలని లేఖలు రాయడం జరిగిందని అధికారులపై సిరిసిల్ల పారసంక్షేమ సమితి ఒత్తిడి చేసిన ఫలితంగా చక్కెర పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిద్దులవాడ లోని రేషన్ డీలర్ కళావతి దుకాణంలో చక్కెర పంపిణీ ప్రారంభించారు.అధికారులకు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుసుమ గణేష్, వేముల సత్యనారాయణ, చిప్ప దేవదాస్, చీకోటి అనిల్, సత్యనారాయణ పాల్గొన్నారు.
