తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం పాలన దక్షతకు ఆకర్షితులై దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కొలను హనుమంత రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పేద ప్రజల కోసం రైతుల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి,బొంగునూరి శ్రీనివాసరెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, జక్కుల మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, ఆకుల ప్రేమ్, కుమార్, యాదవ్, శివకుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
