రుద్రూర్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరాసన.

తెలంగాణ ప్రభ (కోటగిరి): నిజామాబాద్ జిల్లాబాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో మండల మాల మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరాసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా దాసరి శ్యామ్ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ చేయడం పట్ల మండలంలోని మాల మహానాడు నాయకులందరం వ్యతిరేకిస్తూ, సుప్రీంకోర్టు జడ్జిలపై మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టు తీర్పు రాగానే వర్గీకరణకు అమలు పరుస్తామని అనడం సిగ్గు చేటు అన్నారు. మాదిగ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడం సన్మాన సభలు ఏర్పాటు చేసుకోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీలో మాల ఎమ్మెల్యేలు  రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ తీర్పు పై వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఎమ్మెల్యేల , ఎంపీల ఇంటికి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు పరిచినచో గతంలో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరించారు.  గ్రామాలలో కాంగ్రెస్ నాయకులకు తిరుగనివ్వమన్నారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నిరడి ఈశ్వర్,  మండల నాయకులు దాసరి శ్యామ్, బేగరి నవీన్, మాజీ వైస్ ఎంపిపి నాట్కరి సాయిలు, గొర్ల కిషోర్,బండారి చరణ్,బేగారి రాము, పోతురాజు లింగం భాస్కర్ ,వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

.