తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా క్లాత్ బ్యానర్ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా ద్యావనపల్లి పండరినాథ్ ఎన్నికయ్యరు.శుక్రవారం స్థానిక నెహ్రు నగర్ లోని అంబా భవాని ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా కార్యవర్గ నూతన అధ్యక్షునిగా ధ్యావనపల్లి పండరినాథ్,ఉపాధ్యక్షులుగా కుసుమ కృష్ణ,ప్రధాన కార్యదర్శిగా కుందన విష్ణు,కోశాధికారిగా కుసుమ కమలాకర్,కార్యదర్శిగా బూర నరేష్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా క్లాత్ బ్యానర్ ప్రింటింగ్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.అసోసియేషన్ సభ్యులకు ఏ సమస్య ఉన్న అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమను నూతన కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యెల్ది చక్రపాణి,గుండేటి రాజేశం,యెక్కలి దేవి శ్రీనివాసు,కోడం వెంకటేశం,గుండేటి వేణు,ఎక్కలదేవి లక్ష్మినర్సు సభ్యులు పాల్గొన్నారు.
.