తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి వారి ఆధ్వర్యంలో తేళ్ల రవి యువసేన సహకారంతో ప్రాథమిక వ్యవసాయ పాత సహకార సంఘంలో ఆక్యుప్రెషర్, వివిధ వ్యాధులకు శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం 16-08-2024 నుండి 22-08-2024 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి విచ్చేసిన గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, పోలా విట్టల్ సెట్, పోలా అశ్విన్ సెట్ ,మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, రవి అన్న యువసేన నిర్వాహకులు తెల్ల రవికుమార్ కొల్లూరి కిషోర్, శ్రీధర్ బాబు, కొల్లూరి రమేష్, మాశెట్టి నరసయ్య సెట్, జుబేర్, బాబు ఖాన్, మాజి ఎంపీటీసీ సలీం,మండల బిజెపి అధ్యక్షులు వేముల నవీన్, సాయి ప్రసాద్, శ్రీనివాస్, రాయల్ అరుణ్ గౌడ్, బీర్కుర్ శ్యామ్, నార్ల శివ శ్రీనివాస్,
రుద్రంగి సందీప్,నాగరాజు, వర్షిత్, మహమ్మద్ అలీ, క్లబ్ సభ్యులు లయన్ హనుమంతరావు, పెద్దకాపు శ్రీకాంత్, వినోద్ పటేల్, బర్ల అర్పిత్ తదితరులు పాల్గొన్నారు.
.