తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయంలో జరుగుతున్న చండీ మహా యాగం లో భాగంగా శుక్రవారం గోమాత పూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ జింధం కళ చక్రపాణి, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పద్మ పురోహితులతో పాటు పద్మశాలి సంఘం పెద్దలు పాల్గొన్నారు.
