మహిళల ఓట్లతో గెలిచి.. మహిళలని అవమానిస్తవా..

కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్  ఆగ్రహం. 

క్షమాపణ చెప్పాలని డిమాండ్. 

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల.) బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలపై మహిళ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సౌకర్యం కోసం ఫ్రీ బస్ తోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేకే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. 50% పైగా ఉన్న మహిళలు ఓటు వేస్తేనే గెలిచిన కేటీఆర్ ఆ మహిళలని అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం మహిళల్లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెలుమల స్వరూప, మడుపు శ్రీదేవి పలువురు నాయకురాలు పాల్గొన్నారు.

.