కోటగిరి ఏఎంసి నూతన చైర్మన్ గా దళిత నాయకుడు నియామకం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో పోతంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మార్కెట్ కమిటీలు ఉండగా కోటగిరి మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామక పత్రాన్ని ప్రభుత్వం జారీ చేయడం జరిగిందని మాజీ స్పీకర్ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మండలాల ప్రజా ప్రతినిధులకు  తెలియజేశారని మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల  శంకర్ వెల్లడించారు. మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ కావడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా  గాయక్వాడ్  హన్మంతు పేరును ప్రకటించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 12 మంది డైరెక్టర్లు, ఇద్దరు రైస్ మిల్ యజమానులు, సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు, నియామక చేయడం జరిగిందని తెలిలిపారు. వారికి  కోటగిరి మండల మార్కెట్ కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజుకు, మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి శంకర్ పటేల్, కాంగ్రెస్  మండల  పార్టీ అధ్యక్షులు  షాహిద్, సొసైటీ అధ్యక్షులు కూచి సిద్దు మాజీ ఎంపిటిసిలు కొట్టo మనోహర్,విరేశం, మాజీ సర్పంచులు పత్తి లక్ష్మణ్ ఎజాజ్ ఖాన్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, విట్టల్, పులికంటి సాయిలు, ఏఎంసి  నూతన డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

.