కోటగిరిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, ఎఎంసి, రైతు వేదిక, గ్రామపంచాయతీ, వివిధ పార్టీ కార్యాలయాల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలలో, 78వ. స్వతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని  అధికారులు ప్రజా ప్రతినిధులకు,గ్రామ ప్రజలకు 78వ. స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు యువజన సంఘాల అధ్యక్షులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.