జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

హాజరైన కలెక్టర్, జిల్ల కోర్టు జడ్జి, ఎస్పీ

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

సిరిసిల్ల, తెలంగాణ ప్రభ : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

అనంతరం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జిల్లాలోని లీడ్ బ్యాంక్, వివిధ బ్యాంకుల ద్వారా 528 మహిళ సంఘాలకు చెందిన 5626 మందికి రూ 91 కోట్ల రుణాలు, 84 సంఘాలకు చెందిన 423 మంది మహిళలకు స్త్రీ నిధి ద్వారా రూ. 5.22 కోట్లు, మెప్మా ఆద్వర్యంలో 80 మహిళా సంఘాలకు రూ. 10 కోట్ల రుణాలు మంజూరు  లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెక్కులు పంపిణీ చేశారు.

వివిధ శాఖల ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను విప్, కలెక్టర్ అందజేశారు.

కారుణ్య నియామకాల కింద కర్నె దేవేంద్ర, కంకణాల దేవ లత, అనీల్ కుమార్ కు నియామక పత్రాలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడారు.

 ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాట్లు తెలిపారు.. ప్రజాప్రభుత్వం   జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

వ్యవసాయ రంగంకు ప్రాధాన్యత నిస్తు రైతులకు రుణమాఫీ,రైతు భరోసా,రైతు భీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.త్వరలో సన్నారకం పంటలకు బొనస్ ఇస్తామన్నారు.హామీ మేరకు రైతులకు రెండు లక్షల పంట రుణాన్ని మాఫీ చేశామన్నారు.రైతులకు రైతు భరోసా తో ఎకరానికి 15 వేలు,వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రులు,   జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఆయా శాఖల అధికారులు ప్రజల విన్నపాలు తెలుసుకుని ప్రజల పరిష్కరిస్తునట్లుతెలిపారు.

అభయహస్తం హామీలను అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించిఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామన్నారు.మహాలక్ష్మి,  గృహ జ్యోతి పథకాలతో పాటు500 లకే సిలిండర్లు అందిస్తున్నామన్నారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి  అధిక నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.కోడెలకు గడ్డి ,నాణ్యమయిన దాన తో పాటు షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఆలయ విస్తరణ పనులకు,భక్తులకు వసతి గదులనిర్మాణాలకు కోట్లాది రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని వారికి ఉపాధి కల్పనలో పాటు ఇల్లు నిర్మిస్తామన్నారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోరహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.

జిల్లాలో రోడ్లు, భవనాలు, పంచాయితీ రాజ్ విభాగాల పరిధిలో ఉన్న రహదారుల నిర్మాణం, అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిచమన్నారు.

సిరిసిల్లలోని నేతన్నలకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి నేతన్నల ను అదుకుంటుందనన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకం తో మహిళల ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ,జాబ్ మేళలతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ న్నట్లు చెప్పారు.

పింఛన్ల పంపిణీ తో జిల్లాలో చేయూత పెన్షన్ల క్రింద వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, బీడీ టెకేదార్లు, ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులు, పైలేరియా బాధితులు మరియు ఒంటరి మహిళలకు జీవన భ్రుతి క్రింద నెలకు రూ. 2,016/- మరియు దివ్యాంగులకు నెలకు రూ.4,016/- అందిస్తుందన్నారు. త్వరలో హెచ్చింపు పించనులు అందిస్తామన్నారు.

ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం యూనివర్సల్ పాలసీ రూపొందిస్తుందన్నారు.ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించుటకు కృషి చేశామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కు ప్రాధాన్యత ఇచ్చి మెరుగయిన విద్య అందించుటకు కృషి చేస్తున్నామన్నారు. మోడల్ పాఠశాలలు,  కస్తుర్భాగాంధీ విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాల లు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

స్వచ్ఛదనం – పచ్చదనం తో జిల్లాలోని అన్ని గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టామని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనతో గతంలో భూరికార్డుల నిర్వహణలో జరిగిన పొరపాట్లను సవరించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు.అంగన్వాడీ పాఠశాలను ఫ్రీ స్కూల్ గా మార్చనున్నమన్నారు.ఎస్ సి బి సి ,మైనారిటీ ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

అన్ని రంగాల  ప్రజల అభివృద్దే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ,ప్రజలు ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

.