కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్లారెడ్డి, కోడం రమణ, గురజాల శ్రీధర్, గణేష్ నరసయ్య, యశోద రెడ్డి పలువురు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

.