సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ని 34వ వార్డు బి వై నగర్ లో ఇటీవల ఆడేపు శంకరయ్య మృతి చెందా రు. మంగళవారం బాధిత కుటుంబాన్ని స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ పరామర్శించారు. కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా కుటుంబానికి అండగా ఉంటామని దార్ల కీర్తన సందీప్ అన్నారు. కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు
