రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.

మంద సుదర్శన్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంద సుదర్శన్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కార్మిక భవన్ లో జరిగిన రైతు సంఘం సమావేశానికి హాజరైన సుదర్శన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో  ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలు నాయకులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక. 

రైతు సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తీపి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కోనేటి పరుశురాం, కార్యదర్శిగా జంగం అంజయ్య, సహాయ కార్యదర్శిగా రేగటి కనకయ్య,, కోశాధికారిగా దయ్యాల రామకృష్ణ, ఎన్నికయ్యారు.

.