సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాల రికార్డులతో పాటు వంట గదులు ఫుడ్ ఐటమ్స్ తనకి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఉన్నత అధికారులు ఆదేశం మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గత లోన్ గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు, ఫుడ్ మెనూ సరిగ్గా పాటించడం లేదనే ఆరోపణ రావడం గమనార్హం.
