తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఎస్సి రిజర్వేషన్ ల వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడించిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఢిల్లీ నుండి మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన సందర్బంగా సికింద్రాబాద్ నుండి బషీర్ బాగ్ వరకు జరిగిన మాదిగ విజయోత్సవ ర్యాలీకి ఎంజెఎఫ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు పండి గణేష్ మాదిగ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మాదిగ జర్నలిస్ట్ లు తరలివెళ్లారు.ఈ సందర్బంగా ఎంజెఎఫ్ జాతీయ నాయకులు ముక్కేర్ల లాలయ్య, డప్పు రామస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాబు మాదిగ,ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దుమ్ము. చిన్నా మాదిగ, మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉప కులాల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సి రిజర్వేషన్ ల వర్గీకరణ సాధించిన ఘనత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ ది అని అన్నాడు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నాటి పాలకులను ఒప్పించి ఎమ్మార్పీఎస్ సమాజంలో సామజికంగా ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు రిజర్వేషన్ లు అనే ప్రత్యేక హక్కులు సాధిస్తే అభినవ అంబేద్కర్ అయిన మంద కృష్ణ మాదిగ ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సి రిజర్వేషన్ ఫలాలు జనాభా దామాష ప్రకారం అన్ని కులాలకు అందనున్నాయని అన్నారు.ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి ఆత్మ న్యూనత భావంతో వున్న అణగారిన కులాల్లో ఆత్మ గౌరవం నింపిన నాయకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంజెఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తొండ వెంకట్, సురికొంటి శ్రావణ్ ,పండి నరేష్,దీపు, ముత్యపాగ శ్రీశైలం, , అనిల్, ఎమ్మార్పీఎస్ నేతలు బూరు రవి, ఎ. ఎస్తేర్ రాణి, యాకుబ్ , జలగం చంద్రయ్య, ఇంద్రాల లక్ష్మీ, జిన్నపాక చంద్ర కళ తదితరులు పాల్గొన్నారు.
