బానోతు నరేష్ నాయక్. లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు.
సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగనణ చేసిన తర్వాతే రిజర్వేషన్లు కేటాయించాలని లంబాడాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ అన్నారు. సోమవారం ఈ మేరకు ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, బహుజన సేన జిల్లా అధ్యక్షులు శ్రీధర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
