పాఠశాలకు బీరువా విరాళంగా అందజేత.

సిరిసిల్ల (తెలంగాణ ప్రభ) పెద్దూరు ప్రభుత్వ పాఠశాలకు బీరువాను విరాళంగా అందజేశారు. సోమవారం సిరిసిల్ల పట్టణానికి చెందిన గుజ్జే తార పురుషోత్తం దంపతులు మనవడు చైత్విక్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉపయోగం బీరువాను విరాళంగా అందజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థుల ఉపయోగం బీరువా విరాళంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల రమాదేవి, ఉపాధ్యాయులు గుండెలు రవీందర్, తోట శ్రీనివాస్, బైరి వాణిశ్రీ, కడార్ల కల్పన, ఉత్తం విజయ్ కుమార్, నాగుల వీణ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

.