జర్నలిస్టుల కార్యవర్గానికి సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.

తెలంగాణ ప్రభ (కోటగిరి):  కోటగిరి మండల కేంద్రంలోని బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కే.పోచిరాం ఆధ్వర్యంలో జర్నలిస్టుల కార్యవర్గానికి ఘనంగా పూలమాలలు వేసి శాలువతో  సత్కరించారు. డైరీతో పాటు పెన్నును బహుకరించారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి వార్తలన్నిటిని సేకరించి పత్రిక రూపంలో ప్రభుత్వానికి చేరవేసే వ్యక్తులు జర్నలిస్టులని గుర్తు చేశారు. వారిని ఎప్పటికీ మర్చిపోలేమని సన్మాన సభలో తెలిపారు. ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల కల వర్గీకరణ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వర్గీకరణ కాటానికి జర్నలిస్టుల పాత్ర  ఎంతగానో ఉందని గుర్తు చేశారు. వారికి ఈ సన్మాన సభ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు  తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి కన్నం దావులయ్య, మాజీ సర్పంచ్ ఆనంద్, ప్రధానోపాధ్యాయులు నాగయ్య, మండల ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు డ్రైవర్ సాయిలు, అధ్యక్షులు గంగాధర్, సోంపూర్ అధ్యక్షులు సాయినాథ్, సభ్యులు రాజేష్, జలయ్య, గంగారం, శ్రీను, నర్సింలు, సంజీవ్, రాజేందర్, భూమేష్,ఆయా గ్రామాల  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.