తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలాలలోని ఢిల్లీలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు రైతులకు ఆహ్వానించారు. పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారం గ్రామానికి చెందిన రైతు మండవ దిలీప్ కుమార్,హెగ్డోలి గ్రామానికి చెందిన అర్జున్ రావు తమ దంపతులతో 13న ఢిల్లీకి తీసుకెళ్తున్నారని తెలిపారు. ఢిల్లీలో జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సతి సమేతంగా పాల్గొంటున్నామని తెలంగాణ ప్రభ దినపత్రిక విలేకర్ తో తెలిపారు. ఉమ్మడి మండలాల నుండి ఢిల్లీ స్వతంత్ర వేడుకలకు ఎంపిక చేయడం పట్ల ఆయా గ్రామాల రైతులు వర్షం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు.
