అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కలకలం.
సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ ఏకంగా జాతీయ పక్షి నెమలి వంటకాన్ని చేసినట్లు ఓ వీడియోలు అప్లోడ్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో సదరు యూట్యూబర్ ను అధికారులు అదుపులోకి తీసుకొని చట్టపరంగా చర్యలకు సిద్ధం కావడం జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ యూట్యూబ్ అనేక వీడియోలు చేస్తుంటాడు. ఏకంగా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ పక్షి నెమలి మాంసాన్ని ఎలా వండాలి అనే ఓ వీడియో చేసి యూట్యూబ్లో వదిలాడు. వీడియో వీడియో కాస్త వైరల్ గా మారడంతో స్పందించిన అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే వన్య ప్రాణులైన అడవి పంది, ఉడుము ఇలా అనేక వీడియోలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు సమాచారం. అటవీ శాఖ అధికారుల అదుపులో ఉన్న ప్రణయ్ తాను వండేంది కోడి మాంసమేనని వ్యూస్ పెంచుకునేందుకు అలా చేశానని చెప్పడం కోస మెరుపు. యూట్యూబ్ కోడం ప్రణయ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు
