దేవమ్మ బస్తిలో అన్నదానం

పాల్గొన్న యువ నాయకులు జైహింద్ 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యంతో ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ నాయకులు జై హింద్ అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మహేందర్ గౌడ్, రాములు, కిట్టు, సత్యరాజ్, మైలారం రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

.