ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం

కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్. 

పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండాల ఆవిష్కరణ.

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో సుభాష్ నగర్ నుంచి మొదలై గణేష్ నగర్ లో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మ్యాన ప్రసాద్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

.