భౌరంపేటలో ఘనంగా బంగారు మైసమ్మ బోనాలు....

వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద .

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ మున్సిపాలిటీ లోని భౌరంపేట బంగారు మైసమ్మ బోనాల వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి వివేకానంద్  మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు, దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సర్గారి రంగారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ సత్తిరెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్,  నాయకులు యాదిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భీం రెడ్డి, యాదయ్య గౌడ్,  గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

.