డాక్టర్ సురసుర రాధాకృష్ణ కు నల్ల వజ్రం 2024 పురస్కారం

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ సురసుర రాధాకృష్ణకు నల్ల వజ్రం 2024 పురస్కారం వరించింది. శనివారం రాత్రి తార ఆర్ట్స్ అకాడమీ గోదావరిఖని రామగుండంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేశారు. వైద్య సేవలను గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా నిరుపేదలకు 10 రూపాయల ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుర సుర రాధాకృష్ణ సేవలను గుర్తించి నిర్వాహకులు పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అడిషనల్ డీసీపీ రాజు, ఏసీపి ప్రతాప్, మిమిక్రీ కళాకారులు శివారెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నట్లు డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకురాలు సంధ్యారాణి, తార ఆర్ట్స్ అధినేత సంకే రమేష్, తదితరులు పాల్గొన్నారు. సుర సుర రాధాకృష్ణకు నల్ల వజ్రం పురస్కారం రావడం పట్ల సిరిసిల్ల లోని పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.

.