సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) పోపా ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిరుపేద నేత కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఆదివారం పోపా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని 104 మంది నిరుపేద చేనేత కుటుంబాలకు నిత్యవసరం అందించారు. ఈ సందర్భంగా పోపా సీనియర్ సభ్యులు గాజుల ప్రతాప్ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు అధైర్య పడొద్దని ధైర్యంగా నిలబడాలని కోరారు. బాధ్యతగా సాటి కుటుంబాలను ఆదుకునేందుకు పోపా సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో దూస రఘుపతి, మచ్చ ఆనందం, వాసాల హరిప్రసాద్, ఆడెపు వేణు, కనుకుంట్ల తిరుమల, బొల్లి భగవాన్, చక్రపాణి, శ్రీనివాస్, తిరుపతి, గోపి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
