తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): సెస్ రిటైర్డ్ విద్యుత్ లైన్ మెన్ కొడుముంజ శంకరయ్య మృతి చెందారు. సిరిసిల్ల శివనగర్ లోని స్వగృహంలో శుక్రవారం రాత్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
సెస్ లో 1973 నుంచి 2001 వరకూ 28 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం లైన్ మెన్ గా పని చేసి రిటైర్ అయ్యారు.
సెస్ లో లైన్ మెన్ గా పనిచేసారు. సిరిసిల్ల, కోనారావు పేట మండలాలలో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. సమస్యలను తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరిస్తారనే పేరు తెచ్చుకున్నారు.
శంకరయ్య స్వస్థలం బోయిన్ పల్లి మండలం కొదురుపాక. ఉద్యోగ విరమణ తర్వాత కొద్దికాలం చెక్కనం పని చేశారు.
ఉద్యోగంలో చేరకముందు బట్టల పై డిజైన్లు చేసీ పింజర్లు తయారు చేసేవారు.
సెస్ విశ్రాంత లైన్ మెన్ శంకరయ్య మరణవార్త తెలియగానే ప్రజలు, స్థానిక నాయకులు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సెస్ లైన్ మెన్ గా వారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
