సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈదులకంటి రత్నయ్య మృతి పట్ల బిఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం రత్నయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలం నుంచి బిఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉండి రత్నయ్య అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో బిఆర్ఎస్ నాయకులు రమణ, శంకర్, రవి, పెరుమాండ్ల ప్రవీణ్, సిరిగిరి అనిల్, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
