పవర్లూమ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని టి ఆర్ పి ఎస్ ఐ వి  రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ రామకృష్ణ ప్రభు కోరారు. శనివారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆవేద వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సిరిసిల్ల కార్మికుల బతుకుదెరువు కోసం బతుకమ్మ చీరలు పేరుతో ఉపాధి కల్పిస్తే ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. తక్షణం కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గువ్వ తిరుపతి, అజయ్ కుమార్, తంగళ్ళపల్లి వేణు కుమార్, అనిల్ కుమార్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

.