మారుమూల ప్రాంతాలకు వైద్యసేవలు అందించడం అభినందనీయం.

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 

వీర్నపల్లిలో వైద్య శిబిరం. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, అశ్విని హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య శాఖ అధికారి ఎం వసంతరావు తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్య బృందాన్ని అభినందించారు. బిగ్ టివి, అశ్విని హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి వసంతరావు తెలిపారు. ప్రజల అవసరాల కోసం ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. పలువురు వైద్యులు సేవలు అందించారు. కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ పంతగాని పెంచలయ్య  తదితరులు పాల్గొన్నారు

.