ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

పాల్గొన్న కార్పొరేటర్ కొలుకుల జగన్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్  జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు చేనేత కార్మికుల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. చేనేత కార్మికుల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పల్ల దత్తాత్రేయ,రాజేష్,గణేష్,ప్రభాకర్,శివ, జయరాం,రాజు,శ్రీనివాస్, రవీందర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు

.