చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి.

వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్ లోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల కు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు

.